భారత్ జోడో యాత్ర కోసం కమిటీలను ప్రకటించిన టీపీసీసీ

TPCC announced committees for Bharat Jodo Yatra. ఈ నెల 23వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ

By Medi Samrat
Published on : 18 Oct 2022 12:07 PM

భారత్ జోడో యాత్ర కోసం కమిటీలను ప్రకటించిన టీపీసీసీ

ఈ నెల 23వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం టీపీసీసీ 13 రకాల కమిటీలను ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమోదం మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఆర్గనైజేషన్ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేప‌టి క్రితం కమిటీలను ప్రకటించారు. 41 మంది ముఖ్య నాయకులతో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్లు, చైర్మన్ లు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలు, సీనియర్ నాయకులతో రిసెప్షన్ కమిటీ చేసింది.









Next Story