సీఎం కేసీఆర్ ఈ రోజు(శుక్రవారం) మంత్రులతో భేటీ కానున్నారు. సాయంత్రం ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. గురువారం రాష్ట్రపతి ఎన్నికల కు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
కొంత కాలంగా సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్డీయే సర్కారు అన్ని అంశాల్లోనూ విఫలమైందని దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతోనూ సీఎం కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై నేతలతో చర్చించనున్నారు. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. మరీ టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందో చూడాలి.