భారతదేశంలో కులం అనేది కీలకంగా మారిందని టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. సోమవారం ఇంద్రా భవన్ లో ఆయన మాట్లాడుతూ.. కుల గణన జరగాల్సిందేనని.. జరిగితేనే బీసీలు ఎంత అనేది తెలుస్తుందని అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా ఒక గొప్ప పరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలను బయట పెట్టాలని.. తీర్మానం చేయడమే కాదు ఉమ్మడిగా అందరు పోరాటం చేయాలని కోరారు. ఈ విషయమై రాష్ట్రపతికి ఒక లెటర్ రాద్దామని.. సంతకాల సేకరణ, పోస్టుకార్డుల ఉద్యమం చేపడదామని.. అవసరమైతే ఒక రిప్రజెంటేషన్ ఢిల్లీలో ఇద్దామని అన్నారు. ఇక్కడి నుండి పెద్ద ఎత్తున ఉత్తరాలు ఢిల్లీకి పోయేలా ఉద్యమం చేద్దామని.. బీసీ కుల గణన కోసం ఏ ఆందోళనలోనైనా నేను పాల్గొంటాననని కోదండరామ్ తెలిపారు.