తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఆరోజే..

Tinmar Mallanna Bail Petition. తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును మల్కాజ్ గిరి కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.

By Medi Samrat  Published on  12 April 2023 4:30 PM IST
తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఆరోజే..

Teenmar Mallanna


తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును మల్కాజ్ గిరి కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. సెకండ్ కేసు బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించిన మల్లన్న న్యాయవాది ఈ రోజే ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. రేపు ఏప్రిల్ 13న ఒక్కరోజే వర్కింగ్ డే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియచేశారు. దీంతో తీర్పును ఏప్రిల్ 17 సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 11న తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టగా నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ అడ్డుకోవడానికి పాత వారెంట్స్ తెర మీదకు తెస్తున్నారని, సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మల్లన్న న్యాయవాది వాదించారు. తీన్మార్‌ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి.


Next Story