మహబూబాబాద్ జిల్లాలో పులి కదలికలు కలకలం రేపుతున్నాయి. గోదావరి తీరం వెంబడి అడవుల్లో పులి సంచరిస్తుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజగా కొత్తగూడ కోనాపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు బైక్ పై వెళ్తుండగా పాకాల చెక్ పోస్టు వద్ద పులి ఎదురుపడి దాడి చేసేందుకు ప్రయత్నించిందని వారు తెలుపుతున్నారు. భయంతో బైక్‌ను అక్కడే పడవేసి అడవిలోకి పరుగులు తీశారు ఆ అన్నదమ్ములు. దీంతో పులి దాడి నుంచి ఇరువురు త్రుటిలో తప్పించుకున్నారు. నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్తుండగా మార్గమధ్యంలోని అటవీ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడ నుండి పెద్ద లారీ రావడంతో ఆ శబ్ధానికి పులి వెళ్ళిపోయిందని ఆ అన్నదమ్ములు చెబుతున్నారు. అయితే.. ఆ అన్నదమ్ములు బైక్ అక్కడే వదిలేసి ప్రాణ భయంతో లారీలో ఎక్కి తమ గమ్య స్థానానికి చేరుకున్నామని చెబుతున్నారు.