నేను క్షేమంగానే ఉన్నా.. తుమ్మల
తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు.
By - Medi Samrat |
తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వారిని పరామర్శించేందుకు ఐదు రోజుల క్రితమే ఆయన దుబాయ్ వెళ్లారు. ఇరాన్ తన క్షిపణి దాడుల లక్ష్యాన్ని యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాల వైపు మళ్లించింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయడంతో పాటు అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నప్పటికీ, విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కాదని తెలుస్తోంది. తాను సురక్షితంగానే ఉన్నానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే హైదరాబాద్ కు బయల్దేరుతానని చెప్పారు.