పిడుగుపాటుకు ముగ్గురు మృతి

భూపాల‌ప‌ల్లి జిల్లాలో విషాదం నెల‌కొంది. పిడుగుపాటుకు ముగ్గురు బ‌ల‌య్యారు.

By Medi Samrat  Published on  5 Sept 2023 9:00 PM IST
పిడుగుపాటుకు ముగ్గురు మృతి

భూపాల‌ప‌ల్లి జిల్లాలో విషాదం నెల‌కొంది. పిడుగుపాటుకు ముగ్గురు బ‌ల‌య్యారు. చిట్యాల మండ‌లం లో మంగళవారం మధ్యాహ్నం కైలాపూర్‌లో మిర‌ప‌నారు నాటుతుండ‌గా పిడుగు ప‌డి ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి చెందారు. మృతుల‌ను స‌రిత‌(30), మ‌మ‌త‌(32)గా గుర్తించారు. కాటారం మండ‌లం దామెర‌కుంట‌లో పిడుగుప‌డి రైతు మృతి చెందాడు. పొలం ప‌నుల్లో నిమ‌గ్న‌మైన రైతు రాజేశ్వ‌ర్ రావు(46)పై పిడుగు ప‌డి మృతి చెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా, కైలాపూర్ వద్ద మిరప నారు నాటేందుకు వచ్చిన ఇద్దరు మహిళా కూలీలు సరిత(30), మమత(32) పిడుగుపాటుతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు అక్కడకి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story