తెలంగాణలో భారీ వర్షాలు.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు
Three days holidays for eductional institutions in Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు
By అంజి Published on
10 July 2022 10:21 AM GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Three days holidays for eductional institutions in Telanganaసోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందస్తు చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Next Story