తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఫోన్ లో బెదిరించడం కాదు... దమ్ముంటే నేరుగా వచ్చి తనను ఎదుర్కోవాలని రాజా సింగ్ సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవేళ శోభయాత్ర చేస్తే నీ కొడుకును ఎత్తుకెళ్తామంటూ హెచ్చరించాడు. అందుకు రాజా సింగ్ దమ్ముందా... ఉంటే ఫోన్లో కాదు నేరుగా రావాలని సవాలు విసిరాడు. దమ్ము ఉంటే వచ్చి యుద్ధం చెయ్యి... ఈసారి ధూమ్ ధాం కరేంగే అంటూ రాజాసింగ్ అన్నారు. అంతే కానీ రామ నామి శోభాయాత్ర ఆపేదే లేదని రాజా సింగ్ సమాధానం ఇచ్చారు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను ఆపేది లేదు దమ్ముంటే ఆపి చూపించూ అంటూ రాజా సింగ్ సవాల్ విసిరాడు.
రాజాసింగ్ కు 7199942827, 4223532270 నెంబర్స్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజాసింగ్ శోభాయాత్ర జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బెదిరింపులను అందుకున్నారు. రాజాసింగ్ కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి.