Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

By అంజి  Published on  13 Sep 2023 11:06 AM GMT
IT employees, Chandrababu,Wipro circle, Hyderabad

Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని ఎన్నారైల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీరుపై టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. చంద్రబాబుకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ గొంతెత్తుతున్నారు. సీఎం జగన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు.

చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని, చంద్రబాబు వల్లే తాము ఉన్నత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. ఆయన మాత్రం జైల్లో ఉన్నారని ఐటీ ప్రొఫెషనల్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్.. విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందని, చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి చెందిందని.. చంద్రబాబు మాకు ఇన్సిఫిరేష‌న్ అంటూ ఐటీ ఉద్యోగులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదని. ఎక్కడిక్కడ అన్యాయం, అక్రమాలు అని మూకుమ్మ‌డిగా మండిప‌డ్డారు.

ఏపీలో సైకో పాలన నడుస్తుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అని మండిప‌డ్డారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. కావాలనే కుట్ర చేసి బాబును జైలుకు పంపారని.. తాను అవినీతి పరుడు అయితే.. మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ అనుకుంటున్నారని విమ‌ర్శించారు.

హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకం అని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆయన వల్లనే ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందిందని.. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎందరికో ఉపాధి లభిస్తుందని.. ఎందరో ఇవాళ సొంత కాళ్ల మీద నిలబడ్డారని వెల్ల‌డించారు. ఏపీ ప్ర‌భుత్వం ఇదంతా కావాలనే చేస్తుంద‌ని.. అన్ని శాఖలు ఇవాళ జగన్ చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. జాతీయ నేతలు మమతా బెనర్జీ , అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితర నేతలు ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండించారు. ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేసే ధోరణి కేంద్రం నుంచి రాష్ట్రాలకు కూడా పాకిందని అఖిలేష్ విమర్శించారు. ఈ అరెస్టు చంద్రబాబుకే లాభం చేకూర్చే అవకాశం ఉందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.







Next Story