జాయిన్ చేస్తే రూ. 5000 ఇస్తారు..!

This govt school in Malkajgiri offering Rs 5k to parents for admissions. ఈ రోజుల్లో కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలు పిల్ల‌ల‌ అడ్మిషన్ ఫీజుల‌ కోసం

By Medi Samrat  Published on  20 Jun 2022 8:57 PM IST
జాయిన్ చేస్తే రూ. 5000 ఇస్తారు..!

ఈ రోజుల్లో కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలు పిల్ల‌ల‌ అడ్మిషన్ ఫీజుల‌ కోసం తల్లిదండ్రులను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇందుకు భిన్నంగా పిల్ల‌ల‌ను స్కూళ్లో చేర్చిన త‌ల్లిదండ్రుల‌కు న‌గ‌దు ప్రోత్సాహ‌కాన్ని అంద‌జేస్తుంది ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్చిన‌ తల్లిదండ్రులకు రూ.5,000 అందజేస్తోంది.

వివ‌రాళ్లోకెళితే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గోధుమకుంట గ్రామంలోని ప్రజాప్రతినిధులు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్లను ప్రోత్సహించేందుకు వినూత్న ఆలోచన చేశారు. సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఉప స‌ర్పంచ్‌ ఆంజనేయులు చొరవ తీసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆఫర్‌ను ప్రకటించేందుకు వీరివురు పాఠశాల ప్రవేశద్వారం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.

ఇదిలావుంటే.. దాతల సహకారంతో 1 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు పాఠశాల యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించింది. పాఠశాలలో రెండు జతల యూనిఫాంలు, షూలు, సాక్స్‌లు, పుస్తకాలు, బ్యాగ్స్, బస్ పాస్‌లు అన్నీ ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందుతుంది. స్థానిక సంస్థ పాఠశాల ఆవరణలో తగినంత పచ్చదనం ఉండేలా చూసింది. భవనాన్ని అందంగా తీర్చిదిద్దింది. పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం రెండింటిలోనూ విద్య అందుబాటులో ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టింది.













Next Story