శుభవార్త.. నేడు రైతుల అకౌంట్లలో డబ్బుల జమ
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు గుడ్‌న్యూస్. నేడు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రుణమాఫీ కానుంది.
By అంజి Published on 15 Aug 2024 2:00 AM GMTశుభవార్త.. నేడు రైతుల అకౌంట్లలో డబ్బుల జమ
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు గుడ్‌న్యూస్. నేడు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రుణమాఫీ కానుంది. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేస్తారు. అనంతరం అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. తొలి విడతగా రూ.లక్ష, రెండో విడతగా రూ.లక్షన్నర వరకు ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది. ఇవాళ మూడో విడతగా రూ.2 లక్షల వరకు అప్పుగా తీసుకున్న రైతులను రుణ విముక్తులను చేయనున్నారు.
మూడో విడత రుణమాఫీ లిస్ట్ ను అధికారులు విడుదల చేయనున్నారు. లిస్ట్‌లో పేరు వచ్చిందా? లేదా అనేది తెలుసుకోవడానికి సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని రైతులకు మంత్రి పొన్నం సూచించారు. రెండు విడతల్లో కలిపి 18 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ఇంకా అర్హులైన రైతులుంటే రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
కాగా అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావొద్దని, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని తెలిపారు.