Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు.

By అంజి  Published on  2 March 2025 11:30 AM IST
Thieves, cash, SBI ATM, Raviryala, Rangareddy district, Telangana

Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు. ప్లాన్‌ ప్రకారం.. ఏటీఎంలోకి వెళ్లి ఎమర్జెన్సీ సైరన్‌ మోగకుండా సెన్సార్‌ వైర్లను కట్‌ చేశారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌, రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టి డబ్బులు తీసుకుని పరారయ్యారు.

షిఫ్ట్ కారులో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దొంగల ముఠా.. రావిర్యాలలోని ఏటీఎం వద్దకు వెళ్లి, ముందుగా సిసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు అనంతరం కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటిఎంను బద్దలు కొట్టారు. ఆ తరువాత దొంగలు 4 నిమిషాల్లో ఏటీఎం నుండి డబ్బును తీసుకొని అక్కడి నుండి పారిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే మహేశ్వరం డిసిపి సునీతా రెడ్డి, ఏసిపి రాజు ఆదిభట్ల పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఏటిఎం ను పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నట్టుగా బ్యాంక్ మేనేజర్ తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారం గా చేసుకుని దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Next Story