రెండో పెళ్లి చేసుకుంటుండగా.. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

The wife who prevented her husband from remarrying. భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఓ ఆలయంలో భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా

By అంజి  Published on  21 Feb 2022 7:56 AM IST
రెండో పెళ్లి చేసుకుంటుండగా.. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఓ ఆలయంలో భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన పెనుగంచిప్రోలులో ఆదివారం నాడు జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన సరితకు, భువనగిరికి చెందిన చెరుకుమల్లి మధుబాబుకు 4 సంవత్సరాల కిందట పెళ్లి అయ్యింది. కాగా అత్తింట్లో వరకట్న వేధింపులు తాళలేకపోయిన సరిత గత 3 సంవత్సరాలుగా తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇదే విషయమై సరిత పీఎస్‌ కేసు పెట్టగా.. కోర్టులో విచారుణ సాగుతోంది.

గతంలో కూడా మధుబాబు రెండుసార్లు పెళ్లి చేసుకోబోగా భార్య సరిత అడ్డుకుంది. ఇటీవల మధుబాబు కోదాడ సమీప గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. ఆదివారం నాడు పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు వచ్చారు. ఆలయంలోని బేడా మండపంలో పెళ్లి జరుగుతుండగా సరిత, ఆమె కుటుంబ సభ్యులు అక్కడి వెళ్లి మధుబాబుపై దాడి చేసి పెళ్లి అడ్డుకున్నారు. అసలు విషయం చెప్పడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు మధుబాబు కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

Next Story