తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అయితే ఈ సెలవు కేవలం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాలకు మాత్రమే వర్తించనుంది. ఈ మూడు జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం రాష్ట్ర సర్కార్ హాలీడే ప్రకటించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా 3 జిల్లాలకు ప్రభుత్వం హాలీడే ఇచ్చింది.
నిమజ్జనం రోజు పండగ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు అనేక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. దీని కారణంగా ఆఫీసులు, విద్యాలయాలకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే శుక్రవారానికి బదులుగా నవంబర్ 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు మిగతా జిల్లాల్లో యధావిధిగా స్కూళ్లు, కాలేజీలు కొనసాగనున్నాయి.