ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘ‌ట‌న‌ : డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

The governor sought a report from the DGP. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై

By Medi Samrat  Published on  18 Nov 2022 3:04 PM GMT
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘ‌ట‌న‌ : డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం ఖండనీయమని, ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె అన్నారు.



Next Story