'మహిళా దర్బార్' ను నిర్వహించనున్న తెలంగాణ గవర్నర్

The Governor of Telangana will organize the 'Women's Durbar'. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్‌ ను

By Medi Samrat  Published on  8 Jun 2022 7:35 PM IST
మహిళా దర్బార్ ను నిర్వహించనున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్‌ ను ప్రారంభించాలని నిర‍్ణయించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా 'మహిళా దర్బార్‌' తో శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 10న(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు.

"తెలంగాణా గవర్నర్ 10 జూన్ 2022 న మధ్యాహ్నం 12 నుండి 1:00 వరకు రాజ్ భవన్‌లో "ప్రజా దర్బార్"లో భాగంగా "మహిళా దర్బార్" నిర్వహించనున్నారు. మహిళలు చెప్పాలని అనుకుంటున్న విషయాలను.. ఈ వేదిక ద్వారా తమ వాయిస్ ను వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునే వారు 040-23310521కి ఫోన్ చేయడం.. లేదా rajbhavan-hyd@gov.in కి ఈమెయిల్ చేయాలని కోరారు.

ఇదిలావుంటే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ సామూహిక అత్యాచారం ఘటనపై తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పోలీసులను నివేదిక కోరారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ మహేందర్‌రెడ్డిలను గవర్నర్‌ ఆదేశించారు. అయితే గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి స్పంద‌న లేదు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హించ‌నున్న‌ మహిళా దర్బార్ ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

అంతేకాకుండా.. కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ కు పెద్దగా దోస్తీ లేని సంగతి తెలిసిందే. ఇక గవర్నర్ తమిళిసై తో టీఆర్ఎస్ అగ్ర నాయకులు చాలా కాలంగా దూరంగానే ఉన్నారు. గవర్నర్ తో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రజా దర్బార్ కార్య‌క్ర‌మం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.















Next Story