అజారుద్దీన్‌కు రెండు కీలక శాఖలు కేటాయించిన ప్రభుత్వం

లంగాణ మంత్రిగా నియమితులైన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు.

By -  Knakam Karthik
Published on : 4 Nov 2025 2:26 PM IST

Telangana, Azharuddin Telangana Minister, Minority Welfare, Public Enterprises, Cm Revanth Reddy, Telangana Government

అజారుద్దీన్‌కు రెండు కీలక శాఖలు కేటాయించిన ప్రభుత్వం

ఇటీవల తెలంగాణ మంత్రిగా నియమితులైన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

క్రికెటర్‌గా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అజారుద్దీన్, రాజకీయాల్లోకి ప్రవేశించి గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.

Next Story