తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంటోంది.

By అంజి  Published on  20 Jan 2025 7:44 AM IST
cold, Telangana, Cold intensity, IMD, Hyderabad

తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

హైదరాబాద్‌: రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంటోంది. పొగమంచు తెల్లవారుజామున ప్రారంభమై పది గంటల వరకూ ఉంటున్నది. దీంతో ఉదయం పూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లేవారు మాస్కులు ధరించాల్సి వస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రానున్న రెండు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా.. 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్ చెరులో 11, మెదక్ 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5, హన్మకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్ 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

Next Story