టిఫిన్‌ చేయడానికి వెళ్తుండగా.. హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.!

The car crashed into the Hussain Sagar. హైదరాబాద్‌ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్‌ పార్క్‌ దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది.

By అంజి  Published on  28 Nov 2021 8:32 AM IST
టిఫిన్‌ చేయడానికి వెళ్తుండగా.. హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.!

హైదరాబాద్‌ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్‌ పార్క్‌ దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాకి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న యువకులను బయటకు తీసి.. యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ యువకులు ఖైరతాబాద్‌కు చెందిన నితిన్‌, స్పత్రిక్‌, కార్తీక్‌లుగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే కారును తీసుకున్నారని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్‌ నుండి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు.

ఇదిలా ఉంటే.. ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తల్లాడ మండలంలోని అంబేద్కర్‌ నగర్‌ దగ్గర ఆర్టీసీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కొత్తగూడెం నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story