మేడారం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్..ఆర్టీసీ కీలక ప్రకటన

మేడారం మహా జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ‎ఎస్ ఆర్టీసీ) సన్నద్ధం అవుతోంది.

By -  Knakam Karthik
Published on : 17 Jan 2026 2:43 PM IST

Telangana, Medaram Maha Jatara, Sammakka, Sarakka, Devotees, TGSRTC

మేడారం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్..ఆర్టీసీ కీలక ప్రకటన

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ‎ఎస్ ఆర్టీసీ) సన్నద్ధం అవుతోంది. మేడారం జాతర కోసం ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 20 లక్షల మంది ప్రయాణికులను అమ్మవారి చెంతకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అలాగే.. మేడారం మహాజాతర నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేస్తోంది. దేవాదాయశాఖ సహకారంతో మేడారం వెళ్లలేని వారికోసం ఇంటి వద్దకే ప్రసాదం అందించనుంది. రూ.299 చెల్లిస్తే ఇంటి వద్దకే సమ్మక్క-సారలమ్మ బంగారం ప్రసాదాన్ని అందించనుంది ఆర్టీసీ. ఈ ప్రసాదం ప్యాకెట్లో అమ్మవార్ల ఫొటోతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ ఉంటాయి. www.tgsrtclogistics.in, టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ప్రయాణికులకు సూచించింది.

కాగా, 2026, జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Next Story