టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు!

దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

By అంజి  Published on  29 Sept 2024 7:23 AM IST
TGSRTC, cargo services, Dussehra, Telangana

టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు!

దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇ చ్చిన అడ్రస్‌లో డెలివరీ చేస్తారు. ఆర్డర్‌ పరిమాణాన్ని బట్టి టూవీలర్‌ లేదా త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ ఉపయోగిస్తారు. తొలుత దీనిని హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయనున్నారు.

ఈ కామర్స్‌ సంస్థలకు ధీటుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి వస్తువును తీసుకుని చెప్పిన అడ్రస్‌కు ఆర్టీసీ కార్గో డెలివరీ చేయనుంది. దీని కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఆదాయ మార్గాలను పెంచడంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్‌ స్టేషన్‌ నుంచి మరో బస్‌ స్టేషన్‌ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి. దీంతో ఎవరైనా బుక్‌ చేసుకోవాలన్నా, డెలివరీ అయిన వస్తువులను తీసుకోవాలన్న సమీపంలోని బస్సు స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది.

Next Story