Medaram Jathara: ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

మేడారం జాతర కోసం టీజీఎస్‌ఆర్టీసీ వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది.

By -  అంజి
Published on : 17 Jan 2026 11:01 AM IST

TGSRTC, deliver, Medaram Prasadam, Medaram Jathara, SammakkaSaralamma, TGSRTCLogistics, Telangana

Medaram Jathara: ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

మేడారం జాతర కోసం టీజీఎస్‌ఆర్టీసీ వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in ను విజిట్‌ చేయండి.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా, అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను, టీజీఎస్‌ఆర్‌టీసీ వీసీ&ఎండీ వై.నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేవలం రూ.299 చెల్లించడం ద్వారా,అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు తమ ఇంటి వద్దకే పొందవచ్చు. భక్తులు http://tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌ ద్వారాలేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్‌ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, టీజీఎస్‌ఆర్‌టీసీ కాల్ సెంటర్‌ను 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు.

Next Story