హైదరాబాద్: మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 16 నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30 రాత్రి 8.30 గంటలకు మేడారానికి బస్సులు బయలుదేరనున్నాయి.
ఇక మేడారం నుంచి ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00 గంటలకు బస్సులను హన్మకొండకు నడిపేలా ఏర్పాట్లను చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంది. పల్లెవెలుగు బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80గా ఖరారు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.180, పిల్లలకు రూ. 110గా ఛార్జీలను వసూలు చేయనున్నారు.