హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. తాజాగా పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే పరీక్షలను రద్దు చేసి నిర్వహించాలంటూ..ర్యాంకుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పిల్ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. అలాగే ఇప్పటికే 568 అభ్యర్థులకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆదేశాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.