నేటి నుంచే ఎప్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్‌సెట్‌లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి
నేటి నుంచే ఎప్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్: ఎప్‌సెట్‌లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మొత్తం 3,06,796 దరఖాస్తులు వచ్చాయి. రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం- 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాలులోకి అనుమతి ఇస్తారు. పరీక్షా కేంద్రంలోకి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు.
ఎప్‌సెట్ అభ్యర్థులు హాల్ టికెట్లపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ఆధారంగా సులభంగా లోకేషన్‌ను తెలుసుకునే అవకాశం ఉంది. బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో వేలిముద్రలు తీసుకుంటారు. చేతులపై మోహందీ,ఈ టాటూ, ఇంక్‌తో కూడిన ఎలాంటి డిజైన్లు ఉండకూడదు. ఫొటో ఐడీ, హాల్ టికెట్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ వెంట తీసుకెళ్లాలి. ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పరీక్ష సమయం కన్నా ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవడం ఉత్తమం.