Telangana: నేడు అందుబాటులోకి టెన్త్‌ హాల్‌టికెట్లు

తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది.

By అంజి  Published on  7 March 2025 6:52 AM IST
Tenth hall tickets, BSE website , Telangana, Students

Telangana: నేడు అందుబాటులోకి టెన్త్‌ హాల్‌టికెట్లు

తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సారి 10వ తరగతి పరీక్షల్లో కొత్తగా 24 పేజీలతో ఆన్సర్‌ షీట్‌ను ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడిషనల్‌ షీట్ ఇవ్వ‌రు. ఓఎంఆర్‌ షీట్‌ను తప్పులు లేకుండా సరిగా నింపాలని విద్యార్థులకు సూచించారు.

టెన్త్ క్లాస్‌ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ 2025 ఇదే

మార్చి 21 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మార్చి 22 - సెకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 24 - ఇంగ్లీష్‌

మార్చి 26 - మ్యాథ్స్‌

మార్చి 28 - ఫిజిక్స్‌

మార్చి 29 - బయాలజీ

ఏప్రిల్‌ 2 - సోషల్‌ స్టడీస్‌

ఏప్రిల్‌ 3 - పేపర్‌-1 లాంగ్వేజ్‌ పరీక్ష (ఒకేషనల్‌ కోర్సు)

ఏప్రిల్‌ 4 - పేపర్‌-2 లాంగ్వేజ్‌ పరీక్ష (ఒకేషనల్‌ కోర్సు)

Next Story