వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన టెన్త్ పేపర్.. ముగ్గురిపై వేటు

Tenth Class Telugu Exam Question Paper Leak Issue. వికారాబాద్ తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By Medi Samrat  Published on  3 April 2023 1:05 PM GMT
వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన టెన్త్ పేపర్.. ముగ్గురిపై వేటు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


వికారాబాద్ తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇన్విజిలెటర్ బందప్ప మొబైల్ నుంచి తెలుగు పేపర్ లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ లో ముగ్గురు అధికారులు సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏప్రిల్ 3న పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఇన్విజిలెటర్ బందప్పను పేపర్ లీకేజ్‌పై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బందెప్ప స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇతనికి తాండూరులో ఇన్విజిలేటర్ డ్యూటీ పడింది. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ ఎగ్జామ్ ప్రారంభం అయిన వెంటనే బందెప్ప తన మొబైల్ ఫోన్ నుంచి ఫోటో తీసి.. సందెప్ప అనే ఫిజికల్ సైన్స్ లీచర్ కు పోస్ట్ చేశారు. ఈ సమయంలోనే వాట్సాప్ గ్రూప్ లోని ప్రెస్, మీడియా వాళ్లు ఉండే గ్రూప్ లో పొరపాటున పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి వెంటనే డిలీట్ చేశాడు. ప్రెస్, మీడియా వాట్సాప్ గ్రూప్ లోకి షేర్ అయిన టెన్త్ తెలుగు పేపర్ గురించి పోలీసులకు తెలిసిపోయింది. బందెప్పను ఇన్విజిలేటర్ రిలీవర్ కింద విధులు కేటాయించారు.


Next Story