నేటి నుంచి తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
Temperatures will rise in Telangana from today. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో 39 °C
By అంజి Published on 21 Feb 2023 5:00 AM GMTతెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో 39 °C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిబ్రవరి 20, 2023 తర్వాత హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో 35-36 °C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుండి అల్పస్థాయి గాలులు ప్రధానంగా వీస్తాయి.రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
తెలంగాణ వాతావరణ నిపుణుడు టీ బాలాజీ మాట్లాడుతూ.. ''తెలంగాణలో ఈరోజు నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా కాకుండా క్రమంగా పెరుగుతాయి. అయినప్పటికీ వేడిగా ఉండే రోజులు ముందు ఉన్నాయి. వేడి రాత్రులు కూడా ఉన్నాయి'' అని చెప్పారు. ''ఈ సంవత్సరం తెలంగాణ గత రెండు సంవత్సరాల కంటే వేడిగా ఉంటుందని అంచనా వేయబడింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌ను తాకవచ్చు, అయితే హైదరాబాదులో గరిష్ట వేసవి నెలల్లో, ప్రధానంగా మేలో 43-44 డిగ్రీల సెల్సియస్‌ను తాకవచ్చు'' అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గరిష్ఠ ఉష్ణోగ్రతల పట్టిక ప్రకారం.. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఒక్కరోజులోనే వేడిగాలులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఖమ్మంలో ఫిబ్రవరి 19న 32.6 డిగ్రీలు, ఫిబ్రవరి 20,2023న 35.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో సోమవారం మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 19న 32 డిగ్రీలు, ఫిబ్రవరి 20,2023న 33.7 డిగ్రీలతో హైదరాబాద్‌లో 1.7 డిగ్రీల స్పైక్ నమోదైంది. ఫిబ్రవరి 20న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 36.3 °C, ఫిబ్రవరి 19,2023న 35 °C నమోదయ్యాయి. ఐఎండీ డైరెక్టర్ కె. నాగరత్న మాట్లాడుతూ.. ''వేసవి మార్చి, ఏప్రిల్ లేదా మేలో ప్రారంభం కావాలి. అయితే ఇది అధికారికంగా మార్చి 1, 2023న ప్రారంభమవుతుంది." అయితే ఫిబ్రవరి మూడో వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మేము మార్చి 1, 2023 నుండి వేసవి సూచన గురించి స్పష్టమైన వివరాలను పొందుతాము'' అని చెప్పారు.