బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌

Telangana women's commission serious on bandi sanjay. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అవమానకర వ్యాఖ్యలను

By Medi Samrat  Published on  11 March 2023 5:21 PM IST
బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌

Telangana women's commission serious on bandi sanjay


బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ శనివారం సుమోటోగా స్వీక‌రించి.. విచారణ చేపట్టి చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా డీజీపీకు ఆదేశాలు జారీ చేసింది. కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. మహిళా కమిషన్ కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నోటీసులు అందజేస్తామని ఆమె ప్రకటనలో తెలిపారు. విచారణ జరిపి సంజ‌య్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ అంజనీకుమార్‌కు లేఖ రాశారు. బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను బీఆర్‌ఎస్ నేత‌లు ఖండిస్తున్నారు. బండి వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌. బండి సంజయ్‌ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈడీ-మోదీలకు తెలంగాణ సమాజం భయపడే పరిస్థితిలో లేదని అన్నారు.


Next Story