18,973 మందికి షాకిచ్చిన తెలంగాణ రవాణా శాఖ
తెలంగాణ రవాణా శాఖ 18,973 మందికి షాకిచ్చింది.
By Medi Samrat
తెలంగాణ రవాణా శాఖ 18,973 మందికి షాకిచ్చింది. డిసెంబర్ 2023 నుండి జూన్ 2025 వరకు మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి నేరాలకు పాల్పడిన 18,973 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను తెలంగాణ రవాణా శాఖ సస్పెండ్ చేసింది.
తెలంగాణ రవాణా శాఖ మద్యం నడుపుతూ వాహనాలను డ్రైవ్ చేస్తున్న వారిపై చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఎన్నో విషయాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపును ప్రవేశపెట్టింది, దీని వలన నవంబర్ 16, 2024 నుండి జూన్ 30, 2025 వరకు 49,633 EVలకు మొత్తం రూ. 369.27 కోట్ల మినహాయింపు లభించింది. వాహన సంబంధిత సేవల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన 'వాహన్' అప్లికేషన్ ఆగస్టు 2025 నాటికి ప్రారంభించనున్నారు. ఇక తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ మార్చి 15, 2024 నుండి 'TS' నుండి 'TG'కి మారింది.