తెలంగాణలో వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి పెరగనున్న ధరలు
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది
By - Knakam Karthik |
తెలంగాణలో వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి పెరగనున్న ధరలు
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుండి కొత్త వాహనాలపై 'రహదారి భద్రత పన్ను' (రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల (సవరణ) చట్టం-2026 ప్రకారం, కార్లు, ప్రయాణికుల ఆటోలు మరియు ఇతర నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
వాహన రకాన్ని బట్టి ఈ పన్ను రూ. 2,000 నుండి రూ. 10,000 వరకు ఉంటుంది. ఈ కొత్త నిబంధన ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 270 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సెస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మార్చి 1వ తేదీ నుండి షోరూమ్‌లలో కొత్త వాహనాలు కొనేవారు ఈ అదనపు మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి.
తెలంగాణలో పెరగనున్న వాహనాల ధరలు మార్చి 1వ తేది నుండి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుండి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులుతెలంగాణలో మార్చి 1వ తేదీ నుండి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధన అమలు చేయనున్న… pic.twitter.com/wZUfugR4Ze
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026