హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎకరం వరికి ఇకపై రూ.42 - 45 వేల వరకు పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. గతంలో ఎక్కువగా రుణాలు ఇవ్వాలని సూచించింది. పత్తికి రూ.44 - 46 వేలు, మొక్కజొన్నకు రూ.32 - 34 వేలు, పసుకు రూ.87 వేల వరకు ఇవ్వాలని నిర్దేశించింది. ఆయిల్ పామ్‌కు రూ.40 - 42 వేలు నుంచి రూ.42 - 44 వేలకు, మిర్చికి రూ.70 - 80 వేల నుంచి రూ.82 - 84 వేలకు, టమాటాకు రూ.50 వేల నుంచి రూ.53 - 55 వేలకు పెంచింది. గొర్రెలు, మేకల యూనిట్లకూ రుణ పరిమితి పెంచాలని సూచించింది.
కాగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు గత నెల 13న సచివాలయంలో నాబార్డు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. వ్యవసాయానికి సంబంధించిన తదితర అంశాల ప్రాతిపదికన ఏ పంటకు ఏ మేరకు రుణాలు ఇవ్వాలనే దానిపై ఈ సమావేశంలో విస్తృత చర్చ చేశారు. అందరి అభిప్రాయాలు సేకరణ తర్వాత రాష్ట్రంలో సాగయ్యే వివిధ పంటలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు 2024-25 రుణ పరిమితిని ఖరారు చేశారు. తాజా రుణ పరిమితులు అమలు చేయాలని నిర్దేశిస్తూ కమిటీ ఛైర్మన్ రఘునందన్‌రావు, కన్వీనర్ మురళీధర్‌లు తాజాగా అన్ని బ్యాంకులు, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలకు లెటర్లు రాశారు.