తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)కు నోటీఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 5 నుంచి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాసులు చేసుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులలో తెలిపింది. 2025 జనవరి 1 నుంచి 20 వరకూ ఆన్‌లైన్‌లో టెట్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలబెట్టుకుంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ పరీక్షలకు రెండో నోటిఫికేషన్ జారీ చేసింది.