టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరడంతో టీడీపీకి తెలంగాణలో బాస్ లేకుండా అయ్యింది. ఈ నేఫథ్యంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీటీడీపీకి కొత్త బాస్‌ను నియమించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులును తెలంగాణ టీడీపీ శాఖకు అధ్యక్షుడిగా నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నరసింహులు నియామకంపై చంద్రబాబు త్వరలోనే ప్రకటన చేయనున్నారని కథనాలు వెలువడుతున్నాయి.
అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్లను కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ అధ్యక్ష పదవికి విముఖత చూపడంతో.. బక్కిని నరసింహులును అధ్యక్షుడిగా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బక్కిని నరసింహులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షాద్ నగర్ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994, 1999 లలో ఆయన శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.