జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

By Knakam Karthik
Published on : 7 Aug 2025 7:41 AM IST

Telangana, Congress Government,  National Handloom Day today

జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది నేత కార్మికులు, డిజైనర్లకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేసింది. అన్ని శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు TGSCO ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలనే ఆదేశాలు జారీ చేసింది. 2025–26లోఇప్పటివరకు ₹587.26 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ఇందిరా మహిళ శక్తి స్వయం సహాయక బృందాలకు ఏడాదికి రెండు సార్లు ఉచితంగా చీరల పంపిణీ. 65 లక్షల మంది మహిళలకు పంపిణీ చేసేందుకు 131 మ్యాక్స్, 56 చిన్నతరహా పరిశ్రమలలో చీరలు తయారు చేయిస్తున్నారు. 50 కోట్ల కార్పస్ ఫండ్‌తో గత ఏడాది TGSCO నోడల్ ఏజెన్సీగా వేములవాడలో యార్న్ డిపోను ఏర్పాటు చేసింది.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని హైదరాబాద్‌లో నెలకొల్పింది. చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకానికి రూ.33 కోట్లు మంజూరు చేసింది.తెలంగాణ చేనేత అభయహస్తం (NethannaPodhupu – థ్రిఫ్ట్ ఫండ్)లో భాగంగా కార్మికులు తమ జీతం నుండి 8% పొదుపు చేస్తే, ప్రభుత్వం వారి జీతానికి డబుల్ మద్దతుగా ఇస్తుంది. ఈ పథకంతో దాదాపు 36,133 మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. పవర్‌లూమ్ కార్మికుల థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో దాదాపు 15 వేల మంది లబ్ధిపొందుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.30 కోట్లు కేటాయించారు. తెలంగాణ నేతన్న భద్రత పథకం కింద చనిపోయిన చేనేత, అనుబంధ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. కార్మికులకు ప్రోత్సాహకంగా సంవ్సతరానికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు అందిస్తుంది. ఈ ఏడాది రూ.12.20 కోట్ల పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది.

Next Story