అలర్ట్: తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:30 PM IST
అలర్ట్: తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 2025 టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఆయా పరీక్ష తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరతగతి పరీక్షలు జరగనున్నాయి. అలాగే.. ఈసారి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఈ https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పాఠశాలల్లో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 040-23230942 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు అని తెలిపింది.
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్..
మార్చి 21 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 - ఇంగ్లీష్
మార్చి 26 - మ్యాథ్స్
మార్చి 28 - ఫిజిక్స్
మార్చి 29 - బయాలజీ
ఏప్రిల్ 2 - సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3 - పేపర్-1 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)
ఏప్రిల్ 4 - పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు