తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులనే విషయమై కన్ఫ్యూజన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం సంక్రాంతికి మూడు రోజులు సెలవులు ఉన్నాయి. జనవరి 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన సంక్రాంతి ఉంది. ఈ సెలవులను జనరల్ హాలీడేస్ గా తెలిపారు. ఇక ఆప్షన్ హాలీ డేస్ కింద జనవరి 15వ తేదీన కనుమ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రకటనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూశారు. విద్యార్థులకు 9 రోజుల విరామం లభిస్తే అందుకు తగ్గట్టుగా హాలిడేస్ తీసుకోవాలని భావిస్తున్నారు.