హైదరాబాద్: కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన జారీ చేసింది. టి.జి.ఎస్.ఆర్టీసీ వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను తమ యొక్క గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉందని.. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సులలో సేఫ్టీ ప్రీకాషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది తెలిపింది. లహరి ఏ.సీ స్లీపర్, లహరి ఏ.సీ స్లీపర్ కం సీటర్, రాజధాని ఏ.సీ బస్సులలో వెనుక భాగంలో అత్యవసర ద్వారం ను ఏదైనా కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పుటకు ఫైర్ ఎక్స్టింగిషెర్, ప్రధానంగా డ్రైవర్ క్యాబిన్ వద్ద మంటలను ఆర్పుటకు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ ను, మంటలను ఆర్పే పరికరము ను అమర్చబడ్డాయని తెలిపింది.
''ప్రయాణికులను అప్రమత్తం చేయుటకు సైరన్ పొందపరచడం జరిగింది... సూపర్ లగ్జరీ బస్సులలో ఫైర్ ఎక్స్టింగిషర్, బస్సు యొక్క వెనుక భాగం లో కుడి వైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది.. డీలక్స్ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో కుడి వైపు వెనుక భాగం లో అత్యవసర ద్వారం, ఫైర్ ఎక్స్టింగిషెర్ లు ఏర్పాటు చేయడం జరిగింది... మీ ఆదరణ మాకు కొండంత అండా... ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం..'' అంటూ ట్వీట్ చేసింది.