ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయని వివరించింది. విద్యుత్ బస్సుల కారణంగా ఉద్యోగులను తొలగిస్తామన్నదాంట్లో నిజం లేదని, ఎవర్నీ తొలగించబోమని హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిల్ని త్వరలోనే క్లియర్ చేస్తామని పేర్కొంది. సంస్థపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది.
ప్రతిష్ఠకు భంగం కలిగించేలా యూనియన్ లీడర్లమంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న దుష్ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిచింది. ఈ తప్పుడు ప్రచారాన్ని, పుకార్లని నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని స్పష్టం చేసింది.