తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితక్యూష్ మేయర్‌తో సమావేశం అయ్యారు. నగర మేయర్ కజుసాహి తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతం తెలిపారు. సీఎం రేవంత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ సహా తెలంగాణ రైజింగ్ బృందం వారి స్వాగతాన్ని ఆసక్తిగా తిలకించారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న ఈ కితక్యూషు నగరం. గాలి, నీరు, నేల విష పూరితంగా ఉండేవి. ఇప్పుడు ఆ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.