తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా 482 కోవిడ్‌ కేసులు నమోదు

Telangana reports 482 new Covid cases. తెలంగాణలో రోజువారీ కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఆరోగ్య అధికారులు సోమవారం 482 కోవిడ్ పాజిటివ్ కేసులను

By అంజి  Published on  3 Jan 2022 3:21 PM GMT
తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా 482 కోవిడ్‌ కేసులు నమోదు

తెలంగాణలో రోజువారీ కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఆరోగ్య అధికారులు సోమవారం 482 కోవిడ్ పాజిటివ్ కేసులను నమోదైనట్లు తెలిపారు. వాటిలో 294 పాజిటివ్ ఇన్ఫెక్షన్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాల నుండి వచ్చాయి. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో సహా తెలంగాణలోని ఇతర పట్టణ కేంద్రాలలో కూడా సోమవారం కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల నమోదైంది.

484 పాజిటివ్ ఇన్ఫెక్షన్‌లు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 4031 కి చేరుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6, 82, 971 కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,048గా ఉంది. అధికారులు సోమవారం 38, 362 కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. సోమవారం 98.81 శాతం రికవరీ రేటుతో మొత్తం 212 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు, రాష్ట్రంలో మొత్తం 2, 97, 97, 619 కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించబడ్డాయి. అందులో 6,82,971 మంది పాజిటివ్ పరీక్షించారు. 6, 74, 892 మంది కోలుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో 9, జీహెచ్‌ఎంసీ పరిధిలో 294, జగిత్యాలలో 8, కామారెడ్డిలో ఒకటి, కరీంనగర్‌లో 3, ఖమ్మంలో 6, కొమరంభీం ఆసిఫాబాద్‌లో ఒకటి, మహబూబ్‌నగర్‌లో 2, మహబూబాబాద్‌లో 18 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల నుండి నలుగురు, మెదక్ నుండి ఇద్దరు, మేడ్చల్-మల్కాజిగిరి నుండి 48, నల్గొండ నుండి 7, నిజామాబాద్ నుండి ముగ్గురు, పెద్దపల్లి నుండి 4, రాజన్న సిరిసిల్ల నుండి 55, రంగారెడ్డి నుండి 55, సంగారెడ్డి నుండి ముగ్గురు, సిద్దిపేట నుండి ఒకరు, సూర్యాపేట నుండి ఇద్దరు చొప్పున. వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్ నుంచి నలుగురు, హనుమకొండ నుంచి నలుగురు, యాదాద్రి భోంగీర్ నుంచి ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది.

Next Story
Share it