తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. సోమవారం టీఎస్‌పీఎస్సీ నాడు తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ వెబ్ నోట్ ఇచ్చింది. 2022 ఏప్రిల్ నెలలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ ఒకసారి ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది. రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది. అదే సమయంలో ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు ప్రభుత్వం అంగీకరించింది.
ఈ క్రమంలోనే 563 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ తిరిగి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. కొత్త నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఇక అభ్యర్థుల వయోపరిమితిని తెలంగాణ ప్రభుత్వం 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష జరిగే అవకాశం ఉంది.