Telangana Polls: కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

సెప్టెంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

By అంజి  Published on  15 Oct 2023 11:00 AM IST
Telangana, Telangana Polls, congress, mla candidates

Telangana Polls: కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

సెప్టెంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 55 మందికి టికెట్లను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌ ఇవాళ ఉదయం ఉదయం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం వినోద్.. మంచిర్యాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రేమ్‌సాగర్‌రావు.. నిర్మల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా శ్రీహరిరావు.. ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వినయ్‌కుమార్‌రెడ్డి.. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ముత్యాల సునీల్‌కుమార్‌.. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పి.సుదర్శన్‌రెడ్డి.. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా టి.జీవన్‌రెడ్డి.. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌.. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం.ఎస్‌.రాజ్‌ఠాకూర్‌.. మంథని కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా చింతకుంట విజయరమణారావు.. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌.. మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ టికెట్లు కేటాయించింది.

అలాగే ఇటీవలే బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరిన తండ్రి, కుమారుడికి కాంగ్రెస్‌ సీట్లు ఖరారు చేసింది. మెదక్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు.. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు.. ఆంధోల్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ.. సంగారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జగ్గారెడ్డి.. జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆగం చంద్రశేఖర్‌.. గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డి.. మేడ్చల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌.. కుత్బుల్లాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హన్మంత్‌రెడ్డి.. ఉప్పల్‌- పరమేశ్వర్‌రెడ్డి, భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థిగా పొదెం వీరయ్య, ముషీరాబాద్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్‌కుమార్ యాదవ్‌, చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా భీంభారత్‌, కొల్లాపూర్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావులను ఖరారు చేసింది.

నాగార్జునసాగర్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు కుందూరు జయవీర్‌, పరిగి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసారద్​కుమార్, మలక్​పేట్ అభ్యర్థిగా షేక్ అక్బర్, సనత్​నగర్ అభ్యర్థిగా కోట నీలిమ, నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్​ఖాన్, కార్వాన్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ అల్‌ హజ్రీ, గోషామహల్‌ అభ్యర్థిగా మెుగిలి సునీత, చాంద్రాయణగుట్ట కాంగ్రెస్ అభ్యర్థిగా బోయ నగేశ్‌, యాకుత్‌పురా అభ్యర్థిగా రవి రాజు, బహదూర్‌పురా అభ్యర్థిగా రాజేశ్‌కుమార్‌, సికింద్రాబాద్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా సంతోశ్‌కుమార్‌, గద్వాల్‌ అభ్యర్థిగా సరిత, అలంపూర్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా సంపత్‌కుమార్‌, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థిగా రాజేశ్‌రెడ్డి, అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్, కల్వకుర్తి అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా శంకరయ్య, హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి, నల్గొండ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల వీరేశంలను బరిలోకి దింపింది.

ఇక ఆలేరు అభ్యర్థిగా బీర్ల ఇల్లయ్య, ఘన్‌పూర్‌ అభ్యర్థిగా సింగాపురం ఇందిర, నర్సంపేట్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా మాధవరెడ్డి, భూపాలపల్లి అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు, ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క, మధిర అభ్యర్థిగా భట్టి విక్రమార్కలకు తొలి జాబితాలో చోటు దక్కింది. బీఆర్ఎస్​ పార్టీ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన వారికి నలుగురికి ఎమ్మెల్యే అభ్యర్థి స్థానాలు దక్కాయి. మైనంపల్లి హన్మంతరావు.. తన తనయుడు రోహిత్​కి అభ్యర్థి స్థానాలు వరించాయి. అలాగే జూపల్లి, కసిరెడ్డి నారాయణరెడ్డిలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి స్థానాలు దక్కాయి. కాగా.. వామపక్షాలతో కాంగెస్ చర్చలు ఇంకా కొలిక్కిరానట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగూడెం, చెన్నూర్‌ సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నూర్‌ బదులు బెల్లంపల్లి ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతున్నట్లు సమాచారం. అలాగే పాలేరు, మిర్యాలగూడ ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుంది. మరోవైరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు స్థానం ఆశిస్తున్నట్లు తేలుస్తోంది.

Next Story