దీపావ‌ళి వేళ పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది

By Medi Samrat  Published on  29 Oct 2024 7:23 PM IST
దీపావ‌ళి వేళ పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. 182.48 కోట్ల రూపాయల మొత్తాన్ని పోలీస్ సిబ్బందికి మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది ఎదురుచూస్తున్న సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను విడుదల చేయడంపై పోలీస్ అధికారుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన బకాయిలను దశలవారీగా త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

Next Story