తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్టు చేశారు. 4,00,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది.ఈ దాడులలో తొర్రూరు సర్కిల్ సీఐ జగదీష్ ని అదుపులోకి తీసుకుంది. ఓ కేసులో పోలీసులను ప్రభావితం చేయడానికి లంచం కోరినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా, ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ మొదట లంచంలో భాగంగా 2,00,000 రూపాయలు తీసుకున్నారు. ఆపై మిగిలిన మొత్తాన్ని డిమాండ్ చేశారు. పోలీసు అధికారిని కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.