ఛార్జీలు పెంచడం లేదు.. ఆర్టీసీ ప్రకటన

ఆర్టీసీ బస్సు ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచుతోందని సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ తెలిపారు

By అంజి  Published on  13 Jun 2024 10:00 AM IST
Telangana, RTC bus, fare hike, TGSRTC, misinformation

ఛార్జీలు పెంచడం లేదు.. ఆర్టీసీ ప్రకటన 

ఆర్టీసీ బస్సు ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచుతోందని సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ తెలిపారు. అసత్య ప్రచారాన్ని ఖండించారు. సంస్థ పరువు తీసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచిందని, దాని ప్రకారం TGSRTC జూన్ 3 నుండి అమల్లోకి వచ్చిన తన టోల్ సెస్‌ను నవీకరించిందని.. అందుకే టికెట్ రేట్లు మొత్తం రాష్ట్రమంతా పెరిగాయనే పుకార్లను సజ్జనార్ కొట్టిపారేశారు. సాధారణ ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. టోల్ వసూలు చేసే హైవేల మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే టోల్ సెస్ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. జూన్ 12, బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో VC సజ్జనార్ ఛార్జీల పెరుగుదల వార్తలను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. ఆ మార్గాల్లో కూడా, మొదటి టోల్ బూత్ వద్ద ఎలాంటి అదనపు టోల్ సెస్ వసూలు చేయరని, అయితే అంతకు మించి ప్రయాణించే వారికి అప్డేట్ చేసిన టోల్ సెస్ వర్తిస్తుందని ఒక అధికారి తెలిపారు.

ఇక TGSRTC 'గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎసి' బస్సులకు నెలకు 1,900 రూపాయలకు RTC బస్సు పాస్‌లను అందజేస్తోంది. ఈ ఆర్టీసీ బస్సుల పాసుల ధర సాధారణంగా రూ.2,530 కాగా, పర్యావరణహిత ప్రీమియం బస్సు సర్వీసును వినియోగించుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించేందుకు కార్పొరేషన్ రూ.630 డిస్కౌంట్ ను అనౌన్స్ చేసింది.

Next Story