తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్స‌వం.. కొత్త తేదీ ఫిక్స్‌

తెలంగాణ నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2023 7:37 AM GMT
తెలంగాణ  కొత్త సచివాలయం ప్రారంభోత్స‌వం.. కొత్త తేదీ ఫిక్స్‌

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖ‌రారైంది. ఏప్రిల్ 30న కొత్త సెక్ర‌టేరియ‌ట్‌ను ప్రారంభించ‌నున్నారు. నేడు(శుక్ర‌వారం) ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయం పనులు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు తుదిదశకు చేరుకున్నాయని ఇంజినీర్లు కేసీఆర్​కు తెలిపారు. దీంతో ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ స‌చివాల‌యానికి డా.బిఆర్‌. అంబేడ్క‌ర్ పేరు పెట్టిన విష‌యం తెలిసిందే.

వాస్త‌వానికి ఫిబ్ర‌వ‌రి 17నే కొత్త స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభించాల‌ని బావించారు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా నిలిచిపోయింది. తాజాగా కొత్త తేదీని నిర్ణ‌యించారు. జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మార‌కాన్ని ప్రారంభించ‌నున్నారు.

అలాగే.. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మిస్తున్న 125అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవ తేదీని కూడా నిర్ణ‌యించారు. గురువారం రోజున జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్ 14న ఆవిష్కరించటంతో పాటు బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే.

Next Story