బ్రేకింగ్.. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా
Inauguration of Telangana New Secretariat Postponed. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2023 8:52 AM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని బావించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇంతలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సచివాలయం ప్రారంభోత్సవం పై సీఈసీతో సీఎస్ సంప్రదింపులు జరిపారు. అయితే.. సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉంటే.. సచివాలయ ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడంతో అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే కార్యకర్తలకు సూచించారు.. సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం పరేడ్‌గ్రౌండ్ లో భారీ సభను కూడా నిర్వహించాలని బావించారు. ఈ సభకు రావాల్సిందిగా ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. కానీ..ఇంతలో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది.