Telangana: గ్రూప్ - 4 అభ్యర్థులకు శుభవార్త
గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
By అంజి Published on 8 Oct 2024 6:46 AM ISTTelangana: గ్రూప్ - 4 అభ్యర్థులకు శుభవార్త
హైదరాబాద్: గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నిన్న కొంతమంది అభ్యర్థులు గాంధీభవన్‌లో మంత్రి తుమ్మలను కలిసి సమస్యను వివరించారు. 2022 డిసెంబర్‌లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిందని, ఫైనల్ రిజల్ట్ ఇంకా ప్రకటించలేదని అభ్యర్థులు మంత్రికి తెలిపారు. ఈ క్రమంలోనే తుమ్మల టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా 2023లో గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించారు. 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.
తాజాగా గ్రూప్ 4 అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తీపికబురు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి పెట్టారు. భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందాయి. కొన్ని సమస్యలపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.